Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కాస్త డబ్బులుంటే ఈ దీవిని కొనేసుకోవచ్చు.. సొంత బీచ్.. ఏడు ఇళ్లు.. ఒక పబ్.. ఇంకా మరెన్నో!

island with 7 houses and a pub put on sale
Advertisement
  • యూకేలోని స్కాట్లాండ్ తీరానికి సమీపంలో దీవి
  • రూ.26 కోట్లకు అమ్మకానికి పెట్టిన నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ
  • 453 ఎకరాల విస్తీర్ణం.. ఒక హెలిప్యాడ్, లైట్ హౌజ్ కూడా..
Advertisement
మీకంటూ సొంతంగా ఓ దీవిని కొనుక్కోవాలనుకుంటున్నారా? ప్రశాంతంగా గడిపేయాలనుకుంటున్నారా? అయితే ఓ దీవి రెడీగా ఉంది. యూకేలోని స్కాట్లాండ్ పశ్చిమ తీరంలోని సాండా దీవి అమ్మకానికి రెడీగా ఉంది. ప్రఖ్యాత నైట్ ఫ్రాంక్ ప్రాపర్టీస్ సంస్థ దీన్ని అమ్మకానికి పెట్టింది.

ఎన్నో సదుపాయాలతో..
  • 453 ఎకరాల మేర విస్తరించి ఉన్న సాండా దీవిలో ఏడు ఇళ్లు, ఒక చిన్నపాటి పబ్‌ సెటప్‌ ఉన్నాయి. హెలికాప్టర్‌ దిగడానికి వీలుగా హెలిప్యాడ్‌ కూడా ఉంది. ఓ చిన్నపాటి బీచ్‌ కూడా ఉంది. పక్కనే రెండు మరింత చిన్న దీవులు కూడా ఉ‍న్నాయి. ఆ రెండింటిని కూడా సాండా దీవితోపాటు ఇచ్చేస్తారట. ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్‌ హౌజ్‌ కూడా ఉంది.
  • ఇక్కడ ఒక చిన్న గొర్రెల ఫామ్‌ కూడా ఉంది. అందులో 55 గొర్రెలు కూడా ఉన్నాయట. ఇక సముద్ర పక్షులు, ఇతర జంతువులు కూడా ఈ దీవిలో ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉన్నాయట. 
  • ఉత్తర ఐర్లాండ్‌ నుంచి బోటులో ఈ దీవికి చేరుకోవచ్చు. ఉత్తర ఐర్లాండ్‌ లోని క్యాంపెల్‌ టౌన్‌ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుందని నైట్‌ ఫ్రాంక్‌ సంస్థ పేర్కొంది.
  • మరి ధర ఎంతో తెలుసా.. 31 మిలియన్‌ పౌండ్లు.. మన కరెన్సీలో జస్ట్‌ 26 కోట్ల రూపాయలు మాత్రమే. అంటే కాస్త డబ్బులున్న వాళ్లు ఈజీగానే కొనేసుకోవచ్చన్నమాట.
Advertisement
Advertisement
island
UK
scatland
Business News
offbeat

More Telugu News